తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్
కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై వస్తున్న ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకులే ప్రమాదముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, పడకలు వంటి విషయాలపై చర్చించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను…