మేడారం: హిందూ వీరవనితలు సమ్మక్క – సారక్క..!
Sammakkasarakka: 13 వ శతాబ్దాంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం(పన్ను) కట్టలేకపోతాడు. విషయం తెలుసుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు, మిగతా సామంతరాజులు.. పగిడిద్దరాజుకు సాయం చేయడంతో మేడారం ప్రజల బాధ తొలగిపోతుంది. …