childtrafficking: పసిచెక్కిళ్ల మీద జారే కన్నీటి చుక్కల కథ..!
విశీ: పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్‌నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది….
Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!
VuppalaNarasimha: సాహిత్య ప్రేమికులు జీర్ణించుకోలేని వార్త. ప్రముఖరచయిత,సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు. అంతేకాక సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిషలు శోక సంద్రంలో మునిగిపోయారు. వుప్పల నరసింహం సబండవర్ణాల వారసత్వం,వాదం, మట్టి మనిషి ఉప్పల నరసింహం కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం, భావం, క్లేశవుడు,ఊసరవెల్లి,జంగల్ నామాపై జనం ప్రజా ప్రశ్న,ఈ…
Kangana: ‘ఫ్యాషన్’ సినిమా.. కంగనా నటన.. ర్యాంప్ వాక్‌లో తప్పిదం..!
సాయి వంశీ ( విశీ) : 2008లో విడుదలైన హిందీ సినిమా ‘ఫ్యాషన్’ చాలామందే చూసి ఉంటారు. మోడల్స్ జీవితంలోని పార్శ్వాలను అద్భుతంగా చూపించిన చిత్రం అది. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ పోటాపోటీగా నటించారు. ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయనటిగా ఇద్దరికీ జాతీయ పురస్కారాలు రావడం విశేషం. ఆ సినిమాలో ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడుస్తున్న మోడల్ షోనాలి(కంగనా రనౌత్) వేసుకున్న బట్టలు ఉన్నట్టుండి తెగిపోతాయి. ఒక్క క్షణం ఆమె గుండె భాగం అంతా…
జగన్ ని వణికిస్తోన్న లోకేశ్ పాదయాత్ర పాట..!
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం సొంతం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన అస్త్రాలకు పదును పెడుతోంది. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళుతున్నారు. దీనికి తోడుగా, వీలైనన్నీ ఎక్కువ దారుల్లో ప్రజల్లోకి చేరుకోవడానికి, జగన్ పాలనను ఎండగట్టడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతోన్న రవితేజ నటించిన ధమాకా సినిమాలోని జింతక పాటకు పేరడిగా లోకేశ్ పాదయాత్ర పాటను రూపొందించారు తెలుగుదేశం అభిమానులు. ’’జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో…. జై కొట్ట…
BiharElection: బీహార్ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!
BiharElection: బీహార్ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి…
బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ :నాదెండ్ల మనోహర్
APpolitics: వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడినట్లు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి…
