supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!
AntiDefectionAct: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం…