బాలీవుడ్ నటిని మరోసారి విచారించిన ఎన్సీబీ..
బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్‌షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మధ్య నడిచిన వాట్సాప్ చాట్‌లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనన్యను ప్రశ్నించారు. ఈ విచారణలో డ్రగ్స్ గురించి ఆర్యన్‌తో జోక్ చేసినట్లు అనన్య తెలియజేశారని సమాచారం. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్‌లను ఎన్‌సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించారని ఎన్‌సీబి తెలియజేసింది. వీరిద్దరి సంభాషణలో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అనన్యను…