నటుడు సుమన్ కి లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకన్న సుమన్ కు అత్యున్నత పురస్కారం దక్కింది. ఏటా ప్రకటించే లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఈ ఏడాది  సుమన్ దక్షిణాది నుంచి  ఎంపికయ్యాడు. కర్ణాటకకు చెందిన సుమన్‌ యాక్షన్‌ హీరోగా సినిమా తెరకు పరిచమయ్యారు. అన్నమయ్యలో ‘వేంకటేశ్వరస్వామి’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’లో రాముడిగా కనిపించిన ఆయన భక్తిరస పాత్రలు పోషించడంలో తన సత్తా ఏంటో నిరూపించారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘శివాజీ’…

Read Full News

దీదీ కి మరో షాక్!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ , పార్టీలోని ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియోజకవర్గమైన హార్బర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాడు. దీంతో ఎన్నికల సమయానికి ఇంకెంతమంది అసంతృప్తులు పార్టీని వీడుతారాన్న చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటివరకూ తృణమూల్ పార్టీలో కీలక నేతలైన సువెందు అధికారి , సోవన్…

Read Full News

BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read Full News

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read Full News

‘రిపబ్లిక్ ‘ మూవీ విడుదల డేట్ అనౌన్స్ !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్.పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్ట. తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జోడి లో నటిస్తుంది.జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి స్పందన లభించింది….

Read Full News

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…

Read Full News

వాట్సప్ బయోమెట్రిక్ ఫీచర్ !

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్టాప్, లాప్టాప్ వాట్సాప్ వినియోగానికి సంబంధించి బయోమెట్రిక్ అతెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. బయోమెట్రిక్ విధానం వలన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో డేటా దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చు. బయోమెట్రిక్ విధానం కోసం వేలి గుర్తులేదా ఫేస్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. కాగా వాట్సప్ నూతనంగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ అమలైతే…

Read Full News

అగస్త్య ముని కథ!

  ధర్మరాజు కోరికపై రోమశుడు అగస్త్య మహాముని కను సవిస్తరంగా వివరించసాగాడు. “కృతయుగంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తన అనుచరులైన కాలకేయులతో కలిసి దేవతలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వృత్తాసురుని చంపడానికి మార్గం చెప్పమన్నారు. బ్రహ్మదేవుడు “మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలను దానంగా అడిగి తీసుకుని ఆ ఎముకలతో ఆయుధాన్ని చేయండి. ఆ ఆయుధంతో వృత్తాసురుని సంహరించండి” అని…

Read Full News
Optimized by Optimole