Maharashta2024: మహా సంగ్రామంలో కీలకం రిజర్వ్‌డ్ స్థానాలు..!
Maharashtraelections2024: దేశంలో ప్రముఖ సామాజికవేత్తల ఉద్యమాలకు నెలవైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కీలకమైన పాత్ర పోషించనున్నారు. డా.బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, అథేవాలే, కాన్షీరాం వంటి ఎందరో ఉద్దండులను ఆదరించిన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును రిజర్వుడ్ స్థానాలే శాసించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లలో అధిక స్థానాలు సాధించనున్న కూటమికే అధికారం దక్కనుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145 సాధించాలంటే 29 ఎస్సీ, 25 ఎస్టీ…
BJPtelangana: తెలంగాణ బీజేపీకి వైరస్..!
BJPTELANGANA: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏదో వైరస్ సోకినట్టుంది. పాతాకొత్తనీటి కలయిక కుదురుకోవటం లేదు. పార్టీ మూలవాసులకు, వలసనేతలకు మధ్య సయోధ్యకు బదులు సంకులసమరమే సాగుతోంది. స్వార్థం, అలసత్వం, ముఠాతత్వం…. అంతటా ముప్పిరిగొంటున్నాయి. వ్యాధి సంస్థాగత ఎన్నికలకూ పాకి, ప్రక్రియ ఓ ప్రహసనంగా మారుతోంది. ముఠాతత్వం తారాస్థాయి చేరి, గ్రూప్ రాజకీయాలు ఊపందున్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా…. ప్రజాక్షేత్రంలో పార్టీ రోజురోజుకు వన్నె తగ్గుతోందే తప్ప పుంజుకోవటం లేదు. బీజేపీ సంస్థాగత ప్రగతి ‘ఒకడుగు…
Indiaalliance: ‘ఇండియా’ కూటమికి బలం, బలహీనత… కాంగ్రెస్ ..!
నెలల వ్యవధిలో బలోపేతమైన ‘ఇండియా’ విపక్ష కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు వెన్నులో చలి పుట్టించింది. ఇంకొంచెం ముందే జాగ్రత్తపడి, పకడ్బందీగా పొత్తులు కుదుర్చుకొని ఉంటే లోక్ సభలో బలాబలాలు నువ్వా-నేనా అన్నట్టుండేవి. అప్పటికీ, కేవలం 60 సీట్ల వ్యత్యాసం వరకు లాక్కువచ్చి రాజకీయ పండితులనే విస్మయపరిచారు. ‘ఇండియా కూటమి’ నూటాయాబై దాటదన్న పదహారు సర్వే సంస్థల అంచనాలను గల్లంతు చేస్తూ 234 సాధించారు. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అని బీజేపీ నినదిస్తే,…
Jagansharmila: ప్రియాంక, రాహుల్‌ను చూసి జగన్, షర్మిల కొంతైనా నేర్చుకోవద్దా..?
Nancharaiha merugumala (Senior journalist): గురువారం(ఈరోజు) ‘ఈనాడు’ మొదటి పేజీ కింది వార్త ‘తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్’ అనే వార్త. దాని కిందే ‘జగనన్నా..ఇంత అన్యాయమా!’ అంటూ ఆంధ్రప్రదేశ్ రెండో రాజకీయ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వైఎస్ షర్మిలమ్మ ఆవేదనతో కూడిన లేఖ వార్త. ఇదే పేపరు లోపలి పేజీలో ‘రాజకీయాల్లో నాకు 35 ఏళ్ల అనుభవం’ అంటూ భారత జాతీయ ప్రథమ రాజకీయ కుటుంబంలో ఆడబిడ్డ ప్రియాంకా గాంధీ వాడ్రా చెప్పిన మాటలతో మరో…
BJPDHARNA: బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయండి : కేంద్రమంత్రి బండిసంజయ్
Bandisanjay: ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రహొంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు మూసీ బాధితుల పక్షాన శుక్రవారం(ఈనెల25న)ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోందన్నారు. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న…
Minorityvotes: ముస్లీం ఓట్ల చుట్టూ ముగ్గుపోత..!
Muslimvoters: పలు అస్తిత్వాలు, భాషా వైవిధ్యాలు, మత-కుల ప్రభావాల సంఘమంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల సముద్రంలో రాజకీయ పార్టీలు ఎత్తుగడల ఈదులాటతో ఓట్లవేట మొదలెట్టాయి. ఎక్కడ? ఏ ఊతం పట్టుకుంటే, అధిక ఓట్లు దక్కి విజయతీరాలు చేరుతామనే వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. మూడేసి పార్టీలు జట్లు కట్టిన రెండు ముఖ్య కూటములు, ‘మహాయుతి’, ‘మహా వికాస్ అఘాడి’ (ఎమ్వీయే)లు ఇప్పుడిదే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక వ్యూహం, దాదాపు 12 శాతంగా ఉన్న ముస్లీం మైనారిటీల ఓట్ల చుట్టూ,…
Maharashtra: ఆధిపత్య పోరులో…. ‘మహా’పీఠం దక్కేదెవరికో..?
Maharashtra elections2024: మహారాష్ట్రలో అయిదేళ్లుగా జరుగుతున్న రాజకీయ ట్విస్టులు, టర్నులూ… ఒక సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. చీలికలతో చెల్లాచెదురైన పార్టీల మధ్య త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ఉత్కంఠగా సాగనున్నాయని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి బీజేపీ ‘మహాయుతి’ కూటమిగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ‘మహా వికాస్ అఘాడి’…
