Illustrator: బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం..!
Charanparimi: ( Illustrater అను అనామకుడు! ) బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం. ఊర్లో మానాన్న నన్ను ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగికి పరిచయం చేశాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. గవర్నమెంట్ జీతగాళ్ల స్టైల్లో. ఇలస్ట్రేటర్ అంటే అర్థం కాదని పత్రికలో కార్టూనిస్ట్ అన్నా. అంటే బొమ్మలు గీయటమేగా. ఇంకేదన్నా మంచి ఉద్యోగం చూసుకోకూడదు, అన్నాడు. నాకు మోయే.. మోయే! అప్పటిదాకా ఈ బొమ్మలు వేయడం ఒక ప్రత్యేకమైనది. చాలా గొప్పది…