Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..
విశీ: తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు…