APpolitics: ఇచ్చేది రూ.10… దోచేది రూ.1000 – ఇదే జగన్ స్కీం: చంద్రబాబు
Chandrababu: గత ఎన్నికల్లో స్వలాభం కోసం చెల్లిని, తల్లిని ఉపయోగించుకున్న జగన్ ఇప్పుడు వారు నీ నుంచి ఎందుకు దూరమయ్యారని?తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్ ను.. కొత్తగా తనను మేము ఎగతాళి చేస్తున్నామని నాటకమాడుతున్నాడని మండిపడ్డారు. తాను కూడా రాయలసీమ వాసినేనని ..మేమెందుకు నిన్న ఎగతాళి చేస్తామని అన్నారు. ఇంట్లోని కుటుంబ కలహాలు, గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి పొందాలన్నదే…
APpolitics:ఒక్క ఛాన్స్ జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్: చంద్రబాబు
Chandrababu: ‘ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు శవయాత్ర చేయబోతున్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం అంటూ ఊళ్ల మీద పడిన సైకో జగన్ ని ఓడించడానికి జనం సిద్ధమైపోయార’ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసక దోపిడీలకు కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు…
APpolitics: వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం: పవన్
PawanKalyan: విజయనగరం జిల్లాలో లభించిన అపూర్వ స్వాగతం చూస్తే కూటమి విజయం ఖాయమైపోయిందని అర్ధమైందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. మీ ప్రేమాభిమానాలు చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం…
murmu: చిరునవ్వుతో ద్రౌపది ముర్ము.. చిరాకు పెడుతూ దివంగత రాష్ట్రపతి..!
విశీ( సాయి వంశీ) : తాజాగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్‌లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న…
Brahmins: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..
Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు… సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్‌లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా…
Shailakhan : పాకిస్తాన్ లో విప్లవం పుడుతోంది..!
విశీ( సాయి వంశీ):RESPECT TO YOU SHAILA KHAN.. పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబర్ షైలా ఖాన్ చేసిన పని మనమంతా తెలుసుకొని మెచ్చుకోవాల్సిన విషయం. ‘Naila Pakistani Reaction’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలు షైలా ఖాన్. ఆమెది పాకిస్థాన్‌లోని లాహోర్. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే వ్యక్తి. తన అక్క నైలా ఖాన్‌తో కలిసి మూడేళ్ల క్రితం యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టింది. ఆమె ఛానెల్‌కు దాదాపు 6.06 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రజల్లోకి…
APpolitics: మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి..!
Nancharaiah merugumala senior journalist: నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్ గఢ్ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజవర్గం ఉందనే విషయం నాకు తెలీదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్–ఐ తరఫున నారా…
