ముక్కోటి ఏకాదశి విశిష్టత..!
డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్ : ధనూరాశిలో సూర్యుడు సంచరించే మాసం- ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలు అసురశక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించాయి. శ్రీహరి దర్శనాన్ని పొంది, విష్ణు కరుణకు పాత్రులయ్యాయి. సకల దేవతలూ వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే- ముక్కోటి ఏకాదశి. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు…
జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!
Appolitics : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…
Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..
Apelection2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..
covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…