పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ ; బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు .మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడితే కేసీఆర్ మోటార్లకు మీటర్ల పెట్టడం ఖాయమని ఆరోపించారు సంజయ్. దమ్ముంటే కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట సామెత మాదిరి.. తెలంగాణలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరిహారం ఇవ్వని కేసీఆర్… పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం…