ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల పోరు …
ఎన్నికలకు ఏడాది ముందరే పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్ కల్యాణ్! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…