రాబోయే మూడు నెలలు కీలకం : డాక్టర్ శ్రీనివాసరావు
కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు. ఏ మాత్రం ఏమరుపాటు పనికి రాదని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని , కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని తెలిపారు. రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవని, ముఖ్యంగా పిల్లలు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. 70% ఈ రెండు గ్రూప్ లో వాళ్లు ఎక్కువగా ఉన్నారని, మిగిలిన 30% మిడిల్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారని వారు స్పష్టంచేశారు….