Telangana: పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవ జాతి మనుగడకు ప్రమాదకరం:గుత్తా సుఖేందర్

Telangana: పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి,మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు….

Read More

Telangana: ‘విత్తు’ను కాపాడుకోకుంటే ‘విపత్తు’..!!

Telangana: ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్! వేల సంవత్సరాలు దేశీ విత్తనాలు మన వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తూ ఆహార భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చాయి. రైతు నిశ్చింతగా, వ్యవసాయం అదుపాజ్ఞల్లో, నేలసారం సురక్షితంగా, వాతావరణం సమతుల్యతతో, ప్రకృతి పరిశుద్ధంగా ఉన్నాయి. అధిక దిగుబడి కోసం వచ్చిన ‘హరిత విప్లవం’ గొడుగు కింద ముందు, వెనుకలాలోచించకుండా చేసిన కొన్ని చర్యలవల్ల పర్యవసానాలు వికటించాయి. పంట దిగుబడి అసాధారణంగా పెరిగి అప్పటి అవసరాల మేర…

Read More

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read More

saibaba: ఏమైపోతున్నాం..?

saibaba death: చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే…

Read More

KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం! పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు…

Read More

NukalaNarottam Reddy: సజ్జన సాంగత్యం..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): సమాజం కోసం అపారమైన సేవ చేసి కూడా అందుకు తగ్గ ప్రచారం, గుర్తింపు పొందని వ్యక్తులు కొందరుంటారు. స్వతహాగా వారికా యావ, ధ్యాస ఉండదు. ఎందుకో, పలు కారణాల వల్ల సమాజం కూడా వారికి పెద్దగా ప్రచారం కల్పించదు. ఫలితంగా, అటువంటి మహనీయుల చరిత్ర సమకాలికుల్లోనూ ఎక్కువ మందికి తెలియదు. ఇక, తర్వాతి తరాల వారికి తెలియడం ఇంకా అరుదు. అయినా వారు తృప్తిగానే వెళిపోతారు. వెళ్లిపోయాక కూడా…

Read More

నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!

కవీ! నీ భావసంపదకు వందనాలు, నీ ఊహశాల్యతకు నమస్సులు, నీ కవితా పటిమకు నీరాజనాలు. ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది. సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో,…

Read More
Optimized by Optimole