ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటి ?

అనుకున్న‌దొక‌టి అయింది ఒక‌టి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ ప‌రిస్థితికి స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటారా.. త‌మ‌కు ఎద‌రులేదు బెదురులేదు అనుకున్న టీర్ ఎస్ పార్టీకి దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ , హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు షాకిచ్చాయి. వీటికి తోడు వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై సుంకాన్ని త‌గ్గించి.. ఇర‌కాటంలో పెట్టండంతో టీఆర్ ఎస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది….

Read More

తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు ఆరంభం మాత్రమేనని… త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు టిఆర్ఎస్ పార్టీని వీడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని ఈటెల పేర్కొన్నారు….

Read More

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..

ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్‌ల తరలింపులో అధికారులు…నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపుపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్…

Read More

హుజురాబాద్ లో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమ‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అవాంత‌రాలు ఏర్ప‌డుకుండా ఓటింగ్ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మైన‌ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ రాత్రి 7 గంటల వరకూ కొన‌సాగ‌నుంది. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మెుత్తం 2 ల‌క్ష‌ల 37 వేల 22 మంది ఓటర్లున్నారు. అందులో పురుష‌ ఓటర్లు ఒక ల‌క్షా, 18 వేల‌, 7 వంద‌ల,…

Read More

హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..

హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో కొన్ని గంట‌ల్లో ముగియ‌నుండ‌గా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఓట‌ర్ల‌ని ఆక‌ర్షించే ప‌నిలో చివ‌రి ఘ‌ట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుద‌ల చేసింది. కాగా స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌… స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్‌… అనే ప్ర‌ధాని మోడీ నినాదం స్ఫూర్తితో హుజూరాబాద్‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమానికీ, అభివృద్ధికీ కృషి చేస్తామ‌ని రాష్ట్ర బిజెపి మ్యానిఫెస్టోను విడుద‌ల చేసింది. ఇందులో పొందు ప‌రిచిన…

Read More

కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…

Read More

హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. హుజూరాబాద్‌ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని ఓ ప్రధాన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. అందుకనుగుణంగానే…

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గంలో వేల కోట్లు చేశారని.. అయినప్పటికి నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ వెంట…

Read More

కేసిఆర్ మరోసారి దళితులను మోసం చేశారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు…

Read More
Optimized by Optimole