‘‘ప్రతీ చేతికి పని-ప్రతీ చేనుకు నీరు’’ … దిశగా జనసేన-టీడీపీ మ్యానిఫెస్టోను రూపొందించాలి.
‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాలు మాల గుచ్చినట్టు ఉన్నా దీని వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే…