పాలన చేతగాక… మానసిక స్థితి సరిగా లేక జగన్ మాట్లాడుతున్నారు : నాదెండ్ల మనోహర్
APpolitics: ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మేము ఊహించిన దానికంటే దిగజారి మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భార్య అనే బంధాన్ని కించపరిచేలా.. సంబోధించే విషయంలో.. పెళ్లి గురించి మాట్లాడే సమయంలో.. మహిళల మనోభావాలు.. ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అత్యున్నత పదవిలో ఉన్న ఈ వైసీపీ ముఖ్యమంత్రి ప్రతిసారీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.జనసేన…