literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు రేవతి స్వయంభులింగం. తమిళ భాషలో తొలి స్త్రీవాద పత్రిక ‘పణిక్కుడం(ఉమ్మనీటి సంచి)’కి ఆమె సంపాదకురాలు. అనేక కవితలు, కథలు రాశారు. 2000లో తొలి కవితా సంపుటి ‘పూనయై పోల అలయుం వెలిచ్చం(పిల్లిలా తిరుగుతున్న వెలుగు)’ వెలువరించారు. 2002లో విడుదలైన రెండో పుస్తకం ‘ములైగల్(రొమ్ములు)’ వివాదాస్పదమైంది. ఆ పుస్తకాన్ని నిషేధించాలని అనేకమంది మగ రచయితలు డిమాండ్ చేశారు. కవిత్వంలో స్త్రీ లైంగికత, రొమ్ములు, యోని…

Read More

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట తెలియర విశ్వదాభిరామ వినుర వేమ! అంటాడు యోగి వేమన. అభిమానించే దైవం మదిలోనే ఉంటాడని, ఉండాలని ఓ లెక్క! నమ్మకమే ఉంటే…. దేవుడెక్కడ లేడు చెప్పండి? ఇదీ హేతువు! ఇదంతా విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం. మనది ప్రధానంగా విశ్వాసాల మీద ఆధారపడిన జీవన వ్యవస్థ. మనిషిలోని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే వ్యాపార ప్రక్రియలు ఇతర అన్ని వ్యవస్థల్లోకి…

Read More

literature: మన తెలుగు – మన వెలుగు.. పద్య నిర్మాణ కౌశలం..!

Teluguliterature: శా : ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ జీకటిన్ భద్రాకారులఁ చిన్న పాపల రణప్రౌఢక్రియా హీనులన్ నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో? ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలు… అదీ అన్నెం-పుణ్ణెమెరుగని చిన్నారులు… ఒకరో ఇద్దరో కాదు ఐదుగురిని, ఒక్కపెట్టున గొంతుకోసి సంహరిస్తే ఏ తల్తి గర్భశోకమైనా ఎలా ఉంటుంది? గుండెను పిడికిట పట్టి పిసికినట్టుండే ఆ తల్లి హృదయ వేదనను ఆవాహన చేసుకొని… బమ్మెర పోతన రాసిన…

Read More

literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More

MalathiChandur: తెలుగు వారి గూగులమ్మ “సాహితీ” మాలతీ..!

సాయివంశీ: మాలతీ చందూర్ గారి గురించి చెప్పాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల పుణ్యమా స్వాతి సపరివార పత్రిక అనగానే సమరం గారి ‘సుఖ సంసారం’ శీర్షిక టక్కున నెనపుకొచ్చేలా మారింది కానీ, నా దృష్టిలో ఆ రోజుకీ, ఈ రోజుకీ స్వాతి వాళ్లు వేసిన The Best Coloum అంటే మాలతీ చందూర్ గారి ‘నన్ను అడగండి’. 18 నవలలు, ‘చంపకం-చెదపురుగులు’ కథా సంపుటి, పాత కెరటాలు పేరిట నవలల పరిచయం, ‘ప్రమదావనం’ అనే…

Read More

Telugupoetry: పువ్వులూ ‘ మనిషీ ‘…

Poetry: పువ్వులు మట్టి మశానాల పోషకాలతో పూస్తాయి. వాటి మొక్కలకు అందే నీళ్లు కొన్ని మురికిగా, కొన్ని స్వచ్ఛంగా ఉంటాయి. అయినా పువ్వులు పవిత్రమైనవి, అందమైనవి, సుగంధభరితమైనవి. వాటి రంగులు కళ్లకు ఇంపుగా, మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి. ఇక మనిషి- పువ్వుల అందాలను చూస్తూ కన్నీళ్ల కన్నా స్వచ్ఛమైన నీళ్లు తాగుతాడు. ఎర్రెర్రని యాపిల్‌ పండ్లను కొరుక్కు తింటాడు. అయినా అసహ్యంగా తయారవుతాడు. ఎందుకలా? — పాష్తో మూలం: పీర్‌ మహమ్మద్‌ కార్వాన్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు…

Read More

Poetry: మూల్యం విలువ..!

Panyalajagannathdas:   మూల్యం.. ఏదీ ఆశించకుండా ఉండటం, దేనినీ జ్ఞాపకాల్లో దాచుకోకుండా ఉండటం, తిరిగి రావడానికి సొంత నేలనేది లేకుండా ఉండటం చాలా మంచిదని నాకు తెలుసు. అయితే, అలాంటి పరిస్థితుల్లో మనకు కవితలేవీ అర్థంకావు. నాకు బాగా తెలుసు నీలాంటి మంచి కవితలన్నిటికీ వాటి మూల్యం ఉంటుంది. మంచి కవితలన్నీ మన మనోవేదనను మూల్యంగా చెల్లించుకున్నాకే రూపు దిద్దుకుంటాయి. — ఆస్టురియన్‌ మూలం: జీ ఎం. సంచేజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature:  రాయడానికి ఒక చేయి చాలదు. ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి. చెప్పలేని సంగతుల వంచనను చప్పున గ్రహించడానికి, వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే తారక పేరును లిపిబద్ధం చేయడానికి, మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల అల్లిక తెగిపోకుండా చూడటానికి, వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి రెండో చేయి కూడా కావాలి. నిజానికి ఈ రోజుల్లో రాయడానికి రెండు చేతులూ చాలవు. కష్టాల తొక్కిడిలో నలిగిపోయి, ఈ నీచాతినీచ మరుభూమికి చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,…

Read More

Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…

Read More

Valentine’sDay: ఆరురంగుల ప్రేమ..!

Love: “ఆరురంగుల ప్రేమ” 1. చివరకు తిట్టుకోకుండా ఎంతోకాలం మోయలేని బరువులా ప్రేమ వస్తుంది. 2. చూస్తుండగానే తడబడుతూ వచ్చి, చివరకు మండిపడే కొవ్వొత్తి వెలుతురులా, ఆకాశంలో మెరిసే సూర్యుడిలా ప్రేమ వెంట వస్తుంది. మరో రోజు తిరిగి రావడానికి నిష్క్రమించే దాని పుట్టుకను మనం చూస్తాం. 3. ప్రేమ- చెట్టు నుంచి స్రవించే అడవితేనె. మగువ తోటలో దొరికే లేత మొక్కజొన్నకంకి రసధార. 4. ప్రేమ అత్తిపవ్వు. అది ఉడుంపట్టు మాయాజాలం, లేదా ఒక దేవతాహస్తం….

Read More
Optimized by Optimole