newsminute24
literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?
విశీ( సాయి వంశీ): (Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్‌గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది. మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్‌స్టేషన్‌కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి….
Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!
Panyala jagannathdas: నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్ మూలం: అర్దక్ నుర్గాజ్ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు
APpolitics: వై నాట్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి?
APpolitics: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ‘వై నాట్ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది. సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అంటూ ఎప్పుడూ గంభీరంగా పలికే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడడంతో ఉలిక్కిపడుతున్న తీరు చూస్తుంటే ‘వై నాట్ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని చెప్పకనే చెబుతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడమన్నది సర్వసాధారణం. అంతిమంగా ఎవరు గెలిచారు..?…
Nalgonda: చిరంజీవి _ రామ్ చరణ్ యువత అధ్వర్యంలో ఘనంగా చరణ్ జన్మదిన వేడుకలు..
RamcharanBirthday: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు నల్లగొండ జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో.. పలువురు చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అలుగుబేల్లి రామిరెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి ,…
Storytelling: విశీ..భూగోళమంత చేదు (మైక్రో కథ)..!!
విశీ( సాయి వంశీ) : “హూ! కమాన్..” “హే! వద్దు ప్లీజ్!” “ప్లీజ్! ఈ ఒక్కసారికి. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా! ఇదే లాస్ట్ టైం. ప్లీజ్.. ప్లీజ్.. నాకోసం” “ఎప్పుడూ ఇలాగే చెప్తావ్! వద్దంటున్నా ఇంతదూరం తీసుకొచ్చావ్! నాకిష్టం లేదు..” “హే! నాకోసం. ప్లీజ్.. ప్లీజ్! మన లవ్ కోసం. నేనే కదా! ఏమీ కాదు. ప్లీజ్! కొంచెం సేపు.. జస్ట్.. కొంచెంసేపే! నువ్వు చేయకుంటే మన లవ్ మీద ఒట్టు. ప్లీజ్” మొహం…
Poetry: ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే..?
Panyalajagannathdas: సాహసించలేను.. ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే, ఆమెను మేల్కొలిపేందుకు నేనిప్పుడు సాహసించలేను. ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు నా నాలుక పిడచగట్టుకుపోయింది. నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి. తననిలా చూడటానికి నా రెండు కళ్లూ చాలవు. తనను ముద్దాడటానికి నా పెదవులిక నిరీక్షించలేవు. ఇక ఓపలేని ఆత్రంతో నా ఓపికను కోల్పోతున్నాను. — ఇలాంటప్పుడే, ఒక అమరకవి ఇలా అన్నాడు- నేను మరణించానే గాని, నాలోని లౌకికానందానుభూతి మరణించలేదు. జీవంలేని నా దేహంలోంచి నా ఆత్మ సీతాకోకలా…