APpolitics: ఏపీ రాజకీయం..‘‘ఎవరనుకున్నారు…ఇట్లయితదని..?’’
APpolitics: దివంగత నేత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వచ్చినప్పుడు… ‘‘నాలుగొందల సీట్లు వచ్చాయని, ఆయన గాలి పీల్చద్దంటే పీల్చకుండా ఉండాలా?’’ అని ప్రజాకవి కాళోజీ అనేక సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నను సంధించేవారు. ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. వ్యవస్థలను నాశనం చేసి, ప్రజల ఆకాంక్షల్ని లెక్కచేయకుండా ఏకపక్ష పాలన చేసినందుకే జగన్ ను వద్దనుకుని…