ఆంధ్రప్రదేశ్ ‘ బీసీ’ లకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టికెట్లు ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’..!
Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!) =≠====≠======== పెద్దలు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను…