Telugu literature: కుక్కతోక..!
Literature: కుక్కతోక ‘నేను బాగా నాట్యమాడతాను’ కుక్కతో దాని తోక అంది. ‘మనం పోటీ పడదాం’ తోకకు సవాలు విసిరింది కుక్క. అలసిపోయిన కుక్క సహనం కోల్పోయింది. తోకను కొరికి అవతలకు ఉమ్మేసింది. ‘జాగ్రత్త! ఏమనుకున్నావో, ఏమో!’ గుర్రుమంటూ హెచ్చరించింది. — టిగ్రిన్యా మూలం: రీసమ్ హెయిలీ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు