టీఆర్ఎస్ అంతం బీజేపీతోనే సాధ్యం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా :రాజగోపాల్
తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువైన మునుగోడు ఉప ఎన్నిక ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీకి మారుపేరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాత్సరం చేయకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని.. ఏ పార్టీలో చేరేది వారే నిర్ణయిస్తారని రాజగోపాల్ స్పష్టం చేశారు. అవమానాలు భరించలేను.. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై రాజగోపాల్…