కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు!

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్​ పాజిటివిటీ రేటు 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని…..

Read More

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేరళ లో లాక్ డౌన్!

దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు సైతం థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించాయి. అందులో భాగంగానే కేరళ ప్రభుత్వం రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్​ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో కరోనాకి తోడు జికా వైరస్ విజృంభిస్తుండడంతో.. ప్రభుత్వం రెండు రోజుల…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై వస్తున్న ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వలన జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకులే ప్రమాదముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, పడకలు వంటి విషయాలపై చర్చించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను…

Read More

రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు.కోవిడ్ కేసుల పెరుగుదలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం  తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయమై ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో భాగంగానే విద్యాసంస్థలు మూసివేసామని అన్నారు. రాష్ట్రంలోని పలు రంగాలకు సంబంధించిన పెద్దలు తనను కలిశారని, రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్…

Read More

‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ 10% పైగా వృథాగా  ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వ్యాక్సిన్‌ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  వ్యాక్సిన్‌ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని…

Read More

వేగంగా టీకాలు వేసిన దేశంగా భారత్ !

ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ముందుగా ప్రారంభించగా మన దేశంలో మాత్రం జనవరి 16న ప్రారంభం కావడం గమనార్హం. భారత్ మొదటి దశలో కేవలం 13 రోజుల్లోనే 30 లక్షల టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ , అమెరికాను అధిగమించినట్లు వెల్లడించింది. అమెరికాలో 30 లక్షల టీకాలు వేయడానికి కి…

Read More
Optimized by Optimole