Nancharaiah merugumala: (senior journalist)
===================
‘మద్యం మనుషులను కలుపుతుందా?
తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’
మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా పారిన 1970లు, 80లు, 90ల్లో కేశపల్లి గంగారెడ్డి, ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ఏ.బసవారెడ్డి, నర్సారెడ్డి, టీ.బాలా గౌడ్ వంటి తెలంగాణా రెడ్లు, గౌడ వ్యాపారులు–మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కంచి రామారావు, ఆకుల బుల్లబ్బాయి వంటి కోస్తాంధ్ర కమ్మ-కాపు ప్రముఖులతో కలిసి అన్నదమ్ముల్లా సారా వ్యాపారం చేశారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్లు, తెలంగాణ వెలమ వ్యాపారులు, ఢిల్లీ పంజాబీ హిందూ ఖత్రీ వ్యాపారులు, తమిళ, మలయాళ సోదరులు చక్కగా కలిసి కేంద్ర రాజధాని ప్రాంత ప్రజానీకానికి మందు కొరత లేకుండా చూశారని వార్తలొస్తున్నాయి. అవును, లిక్కర్ భాషాభేదం లేకుండా మానవుల్ని కలుపుతుంది.