Atmakur: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని ఆత్మకూరు రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కందడి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి రైతుల పై మోయలేని భారాలు పెట్టీ రైతుల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. రైతులు వ్యవసాయాన్ని మానేసి.. కూలీలుగా మారే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు .వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేనిపక్షంలో రైతులందరినీ పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో DAP బస్తా 1350 ఉండగా ఇప్పుడు 1650 కి పెరిగిందన్నారు. ఇతర కాంప్లెక్స్ ఎరువుల అన్నింటిపై దాదాపు వంద రూపాయలకు పై గా ధరలను పెంచి బీజేపీ సర్కార్ రైతులను నట్టేట ముంచిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా.. వారు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు సిపిఎం నేత వేముల బిక్షం. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని .. పెంచుతామన్న ఆసరా పెన్షన్ లు పెంచలేదన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేదని.. తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ సమితి జిల్లా కార్యదర్శి కానుగంటి శ్రీశైలం, రచ్చ గోవర్ధన్,వేములబిక్షం,రాచమల్లసత్తయ్య,కనుకుంట్ల మధుసూదన్ రెడ్డి,సిరుగురు అంజయ్య, సామ వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.