రైతు నష్టపోతే- పాలకుల్లో కదలిక లేదు… యంత్రాంగంలో స్పందన లేదు: నాదెండ్ల మనోహర్
Janasena: అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి…