కర్ణాటక పోలింగ్ అనంతరం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..

Karnatakaelections2023: కర్ణాటక ఎన్నికల్లో విజయం ఏ పార్టీ వరిస్తుందన్న ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా రీసెర్చ్ సంస్థలు వెలువరచనున్నాయి. ఈనేపథ్యంలోనే పీపుల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి..బుధవారం సా॥ 6.30 గం॥లకు, ఢిల్లీలోని  తెలంగాణ భవన్లో ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ పోస్ట్ , పీపుల్స్ పల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను మీడియా వేదికగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు….

Read More

పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జనసేనాని..

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతాంగాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకొని.. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా కల్పించనున్నారు.   పలు నియోజక వర్గాల మీదుగా జనసేనాని పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు.  

Read More

‘జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కౌంట‌ర్ ‘గా టీడీపీ నేత‌ గిరిధ‌ర్ రెడ్డి వినూత్న కార్యక్రమం..

NelloreRural:  వైసీపీ ప్ర‌భుత్వం నేడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కౌంట‌ర్ గా టీడీపీ నేత‌ కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి వినూత్న  కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూర‌ల్ ప్ర‌జా స‌మ‌స్య‌లను ఏక‌రువు పెడుతూ..” ప్ర‌జ‌ల‌గోడు చెపుతున్నాం.. వినండి.. మా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి స్లోగ‌న్ తో ఎంఎల్ఏ కార్యాల‌యంలో కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కుంటుప‌డిన అభివృద్ధి ప‌నుల్ని ఏక‌రువు పెడ‌దాం.. విన‌ప‌డేలా ..విజృంబిద్ధాం .. సాధించుకుందాం ” అంటూ మీడియా వేదిక‌గా పిలుపు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే…

Read More

‘సంఘ్‌’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!

Nancharaiah merugumala senior journalist: దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్‌ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్‌ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ…

Read More

నేచురల్ బ్యూటీ అందాల సోయగాలు..

అందం, అభియనయం తో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి సాయి పల్లవి. మల్టీ టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న ఫిదా బ్యూటీని  అభిమానులు ప్రేమతో లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకుంటారు. నేడు ఈ అమ్మడి పుట్టిన రోజు సందర్భంగా  శుభాకాంక్షలు మనందరి తరుపున తెలుపుదాం. (Twitter)

Read More

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…

NelloreRural: నెల్లూరు రూరల్:   ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని  కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…

Read More

చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు: పవన్ కల్యాణ్

Janasena:వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జన సేనాని పేర్కొన్నారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి…

Read More

వంద మంది ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌లు, అసదుద్దీన్‌ ఒవైసీలు భారతీయ ముస్లిం సమాజానికి అవసరం కాదా?

Nancharaiah merugumala senior journalist: షాబానూ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయడానికి నాటి రాజీవ్‌ గాంధీ సర్కారు ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి 1986లో రాజీనామా చేశారు ప్రగతిశీల, సంస్కరణవాద ముస్లిం నేత ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌. కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ అప్పుడు ముస్లిం ఛాందసవాదుల మాట విని అభివృద్ధి నిరోధకమైన ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లును చట్టంగా చేయించారు. పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ బులందశహర్‌ కు చెందిన ఆరిఫ్‌ దీనికి నిరసనగా కేంద్ర కేబినెట్‌…

Read More

పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత..

Karnatakaelections2023: కర్ణాటకలో మరో మూడు రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీకి స్వల్ప ఆధిక్యత కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ.. కర్ణాటకలో తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్ సంస్థ చేపట్టిన ప్రీపోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి…

Read More
Optimized by Optimole