ganeshchaturthi: హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్

Bandisanjay:  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ హారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ…

Read Full News

Emchestunnav: ఏం చేస్తున్నావ్ రివ్యూ .. ” అచ్చమైన ప్రేమ కథ ”

విశీ(వి.సాయివంశీ): నాలుగు ప్రేమలు ఉన్న అచ్చమైన ప్రేమకథ..!  ‘ఏం చేస్తున్నావ్?’ ఏం చేస్తాం? పెద్దలైతే కాలక్షేపం చేస్తారు. పిల్లలైతే అల్లరి చేస్తారు. అమ్మానాన్నలు పనులు చేస్తారు. మరి అప్పుడే కాలేజీ ఏజ్ దాటిన కుర్రకారు ఏం చేస్తారు? కొలువు. అదే వారికి నెలవు. అంతేనా? అంతకుమించి ఏమీ లేదా? ఉండకూడదా? ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు అబ్దుల్ కలాం. దాన్ని మనవాళ్లు మరోలా వ్యాఖ్యానించుకున్నారు. ‘ఫలానా కలలే కనండి.. ఫలానా మార్కులొస్తే అవే మీకు మీ కలల్ని…

Read Full News

Mirchi: అలరించిన మిర్చి తెలుగు మాట…!

Mirchi: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా 98.3 రేడియో మిర్చి, ‘‘మిర్చి తెలుగు మాట’’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29న మొదలై వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన ‘‘మిర్చి తెలుగు మాట’’ కార్యక్రమంలో తెలుగుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియయజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేడియో మిర్చి స్టేషన్లలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యమ్రం, ఖండతారాలు దాటిన తెలుగు ఖ్యాతిని ఆవిష్కరించింది. తెలుగును అమితంగా…

Read Full News

Vijayawada: మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు!

Nancharaiah merugumala senior journalist:  ‘ఐదుగురు అప్పాచెల్లెళ్లలో కళ్లులేనిది బుడమేరు’ అని ఎప్పుడో మా అమ్మ చెప్పిన మాట నిజమేనని నిరూపిస్తున్న బెజవాడ వరదలు..! బెజవాడ నగరంలో సమాంతరంగా కనిపించే రెండే రెండు పెద్ద రోడ్లు ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు ప్రాంతాలు ప్రస్తుత వరదల నుంచి సురక్షితంగా ఉన్నాయని తెలుగు టీవీ చానళ్లు చెబుతున్నాయి. ఇది చాలా గొప్ప శుభవార్తే. మరి నిన్నమొన్నటి వానలతో ఈ మధ్యస్థ–మిడీవల్‌ సిటీకి ఉత్తరమో లేదా ఈశాన్యమో తెలియదుగాని ఊరు…

Read Full News

RTI: ఇది వంచన కాదా..?

ఆర్. దిలీప్ రెడ్డి ( మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్):  ప్రజలను శక్తివంతులను చేయడం పాలకులకు ఇష్టముండదు. తమపై ఆధారపడుతూ, ప్రజలెప్పుడూ దుర్బలులుగా ఉండటాన్నే వారు కోరుకుంటారు. జనం ఏ కొంచెం బలపడుతున్నారని పొడగన్నా చాలు… దాన్ని భంగపరిచే వరకు నిద్రపోరు. ఎక్కడ ప్రజలు తెలివిపరులై ఏమడుగుతారో? ఏ తప్పులను ఎండగడతారో? ఏమి జవాబు చెప్పాల్సి వస్తుందో? తమ పని మరింతగా సంక్లిష్టమౌతుందేమో…..? ఇవే వారి భయాలు!   నెమ్మదిగా బలపడుతున్న ఒక సువ్యవస్థ ‘అధికారిక…

Read Full News

Sri krishnashtami: బాల గోపాలుడు, గోపికల వేషాధారణలో అలరించిన చిన్నారులు..!

Shri krishnashtami 2024:కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కృష్ణుడిగా, గోపికలుగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ వేషాధారణలో అలరించిన చిన్నారుల చిత్రాలు చూసి తరించండి. ( ఆద్య ,గిరికబావి గూడెం, నలగొండ) ( తన్విశ్రీ, నల్లగొండ) ( జాన్వీరాం, నల్లగొండ) (G. Rishithasri, S. Pranavi yadav, S.Shivanshika, G. chandhana, Hyderabad) (తను శ్రీ, నల్లగొండ) (ధనుశ్రీ, నల్లగొండ)

Read Full News

Saibaba:సాయిబాబా జైళ్ల కులవ్యవస్థ పై మాట్లాడి మేధావిగా గుర్తింపు పొందగలిగారు!

Nancharaiah merugumala senior journalist: జీఎన్‌ సాయిబాబా మార్క్సిస్టు, కోనసీమ కాపు కాబట్టే జైళ్లలో కులవ్యవస్థ గురించి వెల్లడించిన ఏకైక తెలుగు మేధావిగా గుర్తింపు పొందగలిగారు! ‘‘ఉత్తరాది జైళ్లలో కులవ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఖైదీల కులాన్ని బట్టి అక్కడ పని ఇవ్వాలని జైలు మాన్యువల్‌లో బహిరంగంగా రాసి ఉంది. నాగపుర్‌ జైల్లో కులవ్యవస్థ సర్వత్రా వ్యాపించి ఉంది. జైలు మాన్యువల్‌లో వివరించిన కులవ్యవస్థ ప్రకారం ఖైదీలను కులాలవారీగా ఏమేమి చేయవచ్చో వర్ణించారు,’’ ఈ మాటలు అన్యాయంగా భారత…

Read Full News
Optimized by Optimole