×

Karthikamasam:  కార్తీక మాసంలో వనభోజనాలు ప్రత్యేకం. హైందవ సంప్రదాయం ప్రకారం పవిత్రంగా పూజించే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని శాస్త్ర వచనం. అందుకే ఉసిరి చెట్టు లేదా దానికి కొమ్మనైన వెంట తీసుకొని వెళ్లి వనభోజనం చేస్తుంటారు.శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాక ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి సతీసమేతంగా కొలువై ఉంటారని విష్ణుపురాణం చెబుతుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతుంటారు. సూతమహర్షి సైతం మునులందరితో కలిసి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో చెప్పబడింది. ఈ మాసంలో ఉసిరి చెట్టు మీద నారాయణుడు ఉంటాడని.. అందుచేత ఆ చెట్టును ధాత్రీ నారాయణుడుగా భావించి పూజిస్తే మహాపాతకాలు తొలగిపోతాయని నమ్మకంగా భావిస్తారు.

కార్తీకమాసంలో వనభోజనాల ఉసిరిని భూమాతగా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం సారాంశం. ఇది మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరకసంహిత చెబుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఐదు ఉసిరి మొక్కలను నాటాలని పండితులు చెబుతుంటారు.

వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరిచెట్టు వద్ద విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత చెట్టుకి ఎనిమిది వైపుల దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి. ఉసిరి పత్రితో విష్ణువును పూజించాలి. అనంతరం బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడుతో పాటు గోప బాలకులతో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశాడని భాగవతంలో చెప్పబడింది.శ్రీమహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేసే వారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదని పురాణాల్లో వివరించబడింది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole