×
In

_కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతా గంట నిలిపివేత!

కేంద్రం, ట్విట్టర్ మధ్య మరోసారి అగ్గిరజుకుంది. దీనికి కారణం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతాను సామాజిక మాధ్యమ సంస్థ గంట పాటు నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించడం గమనార్హం. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయానికి సంబంధించి ట్వీట్ చేస్తూ.. మిత్రులారా ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. దాదాపు గంట పాటు నా ఖాతాను ట్విట్టర్ యాక్సిస్‌ చేసుకోనివ్వలేదు. అమెరికా డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పి నా ఖాతాను కొంతసేపు బ్లాక్‌ సామాజిక మాధ్యమం నా ఖాతా ను నిలిపివేసింది. కొద్దిసేపటి తర్వాత యాక్సిస్‌ను పునరుద్ధరించింది’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ట్విటర్‌ ఐటీ నిబంధనలను ఉల్లంఘించిందని..నా ఖాతాను యాక్సిస్‌ను నిలిపివేసే ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
‘ట్విట్టర్ లేవనెత్తిన అంశాన్ని కి వివరణ ఇస్తూ.. నేను పోస్ట్‌ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్‌ గానీ కాపీరైట్‌ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేశామని ట్విటర్‌ చెబుతోంది. నిజానికి ట్విటర్‌ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉంటార’’ని కేంద్రమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విటర్‌ ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ ట్విటర్‌ నూతన నిబంధనలను అమలు చేస్తే.. తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా బ్లాక్‌ చేసే అవకాశం ఉండదు కదా..అని చురకలంటించారు.
నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని.. కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all
Optimized by Optimole