×
In

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే మరో ఉపద్రవం నిఫా వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలో శాస్త్రవేత్తలు గుర్తించారు. పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ ఈ వైరస్ వివరాలను బయటపెట్టింది.
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్​ పరీక్షించగా.. వాటిల్లో వైరస్​ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్​ను గుర్తించలేదని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. కరోనా వైరస్​ కన్నా నిఫా వైరస్​ ఎంతో ప్రమాదకరమైనది. డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) గుర్తించిన ప్రమాదకర వైరస్​ల జాబితాలో మొదటి పది స్థానాల్లో ఈ వైరస్ ఉంది. దీనిని మొదటిసారిగా మలేషియాలో 1998-99లో పందుల్లో దీనిని గుర్తించారు. ఈ వైరస్​కు టీకా కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తే ప్రాణ నష్టం అపారంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో.. నిఫా వైరస్ తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ఈ వైరస్కు తిక్క తయారు చేసే పనులను పరిశోధకులు ముమ్మరం చేశారు. ప్రభుత్వాలు సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all
Optimized by Optimole