పాదయాత్రలు , రైతుల రుణమాఫీ ఉద్యమం పేరిట దూకుడు పెంచిన టీకాంగ్రెస్…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఓవైపు పేపర్ లీకేజ్ లు, లిక్కర్ స్కాంలతో బీజేపీ, అధికార బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసుకుంటుంటే.. మరోవైపు హస్తం పార్టీ నేతలు చాప కిందనీరులా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రతో బిజీ షెడ్యూల్ గడుపుతుంటే .. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లె అనిరుథ్ రెడ్డి, పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు రైతుల రుణమాఫీపై దరఖాస్తుల ఉద్యమం పేరుతో జోరుమీదున్నారు. మొత్తంగా…
