Latest
cyber: స్మార్ట్ ఫోన్ తో జాగ్రత్త ..హెచ్చరిస్తున్న నిపుణులు..!
Smartphone: నిద్రలేచిన మొదలు..పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వినోదానికి, కాలక్షేపానికి, వ్యాపార లావాదేవీలతో పాటు ప్రతి అంశానికి సంబంధించి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి వేళ్లు టచ్ స్క్రీన్ పై ఉంటున్నాయి. సాంకేతికంగా దగ్గర చేస్తూనే.. సైబర్ వ్యసనానికి బానిసగా మార్చేస్తోంది. వైవాహిక జీవితాల్లో కలహాలు..చిన్నారులు, యువత పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు సర్వే సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించడంపై…
Saibaba: ఒక వీరునికి కడసారి వీడ్కోలు..!
తాడి ప్రకాష్: 2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద… రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం…
NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!
నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు): తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. కథలన్నీ…
saibaba: ఏమైపోతున్నాం..?
saibaba death: చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే…
Haryana:హర్యానాలో అంచనాలు తలకిందులకి కారణాలు…!
Haryana elections2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేయడంతో పాటు అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో ఒక్క శాతంలోపు ఓట్ల వ్యత్యాసంతో దోబూచులాడిన ఫలితం చివరికి బీజేపీకి పట్టంకట్టి, కాంగ్రెస్ను నిరాశకు గురిచేసింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో నువ్వా నేనా అన్నట్టు తలపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం పది స్థానాల్లో చెరో ఐదింటిని సాధించడంతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఐదు నెలల…
INC: పాఠాలు నేర్వకుంటే మళ్లీ పరాభవమే..!
Congress: ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరొక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చూపే ప్రత్యక్ష ప్రభావం నామమాత్రమే! కానీ, నేర్చుకోవడానికి పాఠాలు, గుణపాఠాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అవి నేర్వడానికి సిద్దంగా లేని పార్టీలు… చేసిన తప్పులే చేస్తూ ఉండొచ్చు, పడిన గోతిలోనే మళ్లీ మళ్లీ పడొచ్చు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే! ఎక్కడో జరిగిన దాన్నుంచి పాఠం నేర్వనందునే హర్యానాలో ఆ పార్టీకి ఎదురైన క్షమార్హం కాని ప్రస్తుత ఓటమి. ఏతావాతా అన్ని…
BIGALERT:ఆడవాళ్లు ఏ బట్టలేసుకుంటే నీకెందుకురా కుయ్యా?
BIGALERT: మొత్తం చదవండి. చాలా విలువైన, కీలకమైన అంశం. మరీ ముఖ్యంగా మగవాళ్లంతా చదవండి. బెంగళూరు నగరంలోని ‘Etios Digital Services’ అనే సంస్థలో పనిచేస్తున్నాడు నిఖిత్ శెట్టి. హాయిగా పనిచేసుకుంటూ ఉంటే సమస్య లేదు. ఖ్యాతిశ్రీ అనే వివాహితపై అతని దృష్టి పడింది. ఆమె వేసుకునే బట్టల మీద ఆ దృష్టి మరింత పడింది. ఆమె మీద వ్యక్తిగత కక్షో, లేక ఆమె బట్టలు కర్ణాటక రాష్ట్ర సంప్రదాయానికి అనువుగా లేవన్న ‘మతాధిపతి’ మనస్తత్వమో, ఆడవాళ్లు…
mirchi: బతుకమ్మ స్పెషల్ ర్యాప్ విడుదల చేసిన మిర్చి..!
Mirchi: బతుకమ్మ అంటేనే పాటల పండగ. ఆటల వేడుక. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్చి తెలుగు వినూత్నరీతిలో బతుకమ్మ ర్యాప్ సాంగ్ విడుదల చేసింది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే రకరకాల పూలు, బతుకమ్మ ప్రత్యేకత, బతుకమ్మ చరిత్ర, బతుకమ్మ సమయంలో ఉండే అనుబంధాలను కలపోతగా ఈ పాటను రూపొందించారు. మోడ్రన్ మ్యూజిక్, తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటను మిర్చి స్వాతితో ఫ్లవర్ మార్కెట్ లో చిత్రీకరించారు. కాగా, ఈ పాటను సద్దుల బతుకమ్మ నాడు…
Karimnagar: దుర్గాదేవిగా అమ్మవారు.. జోరువానలో మహిళల బతుకమ్మ..!
Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం( ఎనిమిదోవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు….
