పాఫం కమ్యూనిస్టులు..చివరికి ఇలా మిగిలారు…!!
Telanganapolitics: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వామపక్షాల పరిస్థితిని చూస్తే ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్ ఎంతో ఆవేదనతో చెప్పిన ‘‘చివరికి ఇలా మిగిలాం…’’ అనే మాటలు గుర్తుకొస్తున్నాయి. గతంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన కమ్యూనిస్టులు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు. ‘‘ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా…’’ పాటలోని మొదటి వరుసను ‘ఎవరో పిలుస్తారని…’ అని మార్చితే తెలంగాణ వామపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్ పిలుస్తారని…