Modi: రాముడి అంశతో జన్మించిన మోదీని కళ్ళారా చూస్తున్నాం..!
NarendraModi :దేశ భవిష్యత్తును మలుపు తిప్పే ఒక మహత్తర సంఘటన జరుగబోతుంది. దేవీదేవతల ఆశీర్వచనం కోసం దేశాన్నేలే చక్రవర్తి దేశాటన చేస్తున్నాడు. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకూ సనాతన శ్రద్ధాకేంద్రాలను దర్శిస్తున్నారు.కాశీ విశ్వనాధుడి ఆశీస్సులను స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగా బావుల పవిత్రజలాలతో తనను తాను సంప్రోక్షణ చేసుకుంటున్నారు.శిరస్సు నుంచి కాలి చిటికెన వేలు వరకూ అభిషేక జలాలతో పవిత్రుడయ్యారు.బాల రాముడి ప్రాణప్రతిష్టను దిగ్విజయంగా ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో రామునికి జయజయకారాలతో వీక్షిస్తూ క్రతువుకు యజమానైన దేశాధినేతకు…