పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ ఓటు బీజేపీకే!

తెలంగాణలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశించిన కేసీఆర్‌ ఆశలను వమ్ముచేస్తూ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పుకు ఓటు వేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి రావడంతో బొటాబొటి ఆధిక్యతతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 2018తో పోలిస్తే 2023లో బీజేపీ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఆ పార్టీ  రాష్ట్రంలో క్రియాశీలకంగా మరబోతోందని చెప్పవచ్చు. వాస్తవానికి తెలంగాణలో మొదటి నుండి కేసీఆర్‌ ప్రభుత్వం…

Read More

రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?

Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్‌–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ  రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్‌–డిసెంబర్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…

Read More

విమర్శలు సరే! వాస్తవాలనూ విస్మరిస్తారా?

శేఖర్ కంభంపాటి ( సీనియర్  జర్నలిస్ట్ ): ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు  రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒంటికాలు మీద లేచేవి. స్వాతంత్ర్య భారతంలో అర్థ శతాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసిందనే విమర్శలు చేసేవి, ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి…

Read More

రాజ్యాధికారం దిశగా జనసేన అడుగులు వేయాలి…!

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు వాటి సిద్ధాంతాల్లో సారుప్యత ఉండాలి. ఇరు పార్టీలకూ ఒకే లక్ష్యం ఉండాలి. దీనికోసం ఒకే రకమైన ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలి. ఈ మూడు విషయాల్లో జనసేన, తెలుగుదేశం ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంపై (సీఎంపీ) కసరత్తు కూడా పూర్తి చేశాయి. జనవాణి, వారాహి యాత్రల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సీఎంపీలో పొందుపరచాలి. అయితే, ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై సంతకం చేసి, కూటమి…

Read More

వ్యూహకర్తలకు అంత సీన్ ఉందా? గెలిపించగలరా?

ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రశాంత్‌’ పేరిట మీడియా, సోషల్‌ మీడియాలో చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటిదాక బిగ్‌బాస్‌ ‘పల్లవి ప్రశాంత్‌’ సలార్‌ డైరెక్టర్‌ ‘ప్రశాంత్‌ నీల్‌’ పేర్లు వైరల్‌ అయితే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన రాజకీయ వ్యూహకర్త ‘ప్రశాంత్‌ కిశోర్‌’ వైరల్‌ అవుతున్నారు.  గతంలో బీఆర్‌ఎస్‌కు కూడా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడో పార్టీకి సలహాలు ఇవ్వడానికి  సిద్ధమయ్యారు. నిజంగా వ్యూహకర్తలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలరా?…

Read More

రామ దీక్ష చేపట్టనున్న బండి సంజయ్‌ కుమార్‌?

BJPTELANGANA: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ రామ దీక్ష చేపట్టనున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌, విశ్వహిందూ పరిషత్‌ హిందూధార్మిక సంఘాలు ఇచ్చిన సలహా మేరకు బండి సంజయ్‌ దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు కాషాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ ముఖ్య నేతలు కూడా బండి సంజయ్‌తోపాటు రామ దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన సన్నాహాలు సైతం…

Read More

“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!

BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను  సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..  మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో  ప్రజానాడి…

Read More

TV9 అధినేత వ్యాఖ్యలపై ఎడిటర్‌ రజనీకాంత్‌ జవాబివ్వరా?

Nancharaiah merugumala senior journalist: ‘నేను 2018లో తీసుకునే వరకూ టీవీ 9 ను నక్సలైట్‌ వ్యవస్థలా నడిపారు,’ అని …‘మైహోం’ జూపల్లి రామేశ్వర్‌ రావు గారు చెప్పాక కూడా మేనేజింగ్‌ ఎడిటర్‌ వెల్లలచెరువు రజనీకాంత్‌ జవాబివ్వరా? సోమవారం కడ్తాల్‌ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మైహోం గ్రూప్‌ అధిపతి డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు. ‘2018లో నేను…

Read More

వంగవీటి రంగా హత్యానంతరం తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి..

Nancharaiah merugumala senior journalist: ” వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్‌ తెలుగు జర్నలిస్టులకు  ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి!” బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్‌ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్‌’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా…

Read More

దయానిధి మారన్‌ యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?

Nancharaiah merugumala senior journalist: ” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్‌..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?” ఉత్తరప్రదేశ్, బిహార్‌ నుంచి వచ్చిన ఇంగ్లిష్‌ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్‌ సభ సభ్యుడు దయానిధి మారన్‌ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్‌) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి…

Read More
Optimized by Optimole