Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!

In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…

Read Full News

Unionbudget2024 : బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత హర్షణీయం: నాదెండ్ల మనోహర్

NadendlaManohar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు కేటాయించడం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంపై జనసేన పార్టీ శాసనసభ పక్షం తరఫున కృతజ్ఞతలు తెలిపారు….

Read Full News

Bandisanjay: జోడెద్దుల మాదిరి అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలా బడ్జెట్ రూపకల్పన: సంజయ్

Budget 2024: జోడెద్దుల మాదిరిగా అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు బడ్జెట్ ప్రతీకగా ఉందన్న ఆయన.. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ను రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50…

Read Full News

RammohanNaidu: ‘ కింజరాపు ‘ ఓ వెలుగు కిరణం.

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద…

Read Full News

Appoliticalwar: ఏపీలో దాష్టీకాలకు ముగింపు ఎప్పుడు?

POLITICALWAR: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నిత్యం నెత్తురు చిందే ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. వేధింపులు, కక్షలు, దాడులు, దాష్టీకాలతో ఉడికిపోతోంది. హత్యలకూ వెనుకాడడం లేదు. బీహార్, బెంగాల్ తరహా హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. రక్తపు మడుగుల వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలంటే శాంతిభద్రతలు కీలకమనే మౌలిక సూత్రాన్ని గత పాలకులు, ప్రస్తుత పాలకులు విస్మరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి  సర్కార్ పై అసంతృప్తితో ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని మట్టికిరిపిస్తే వారి ఓటమి నుండి…

Read Full News
bjp telangana,bjp,

BJP: ద‌క్షిణాదిన‌ పుంజుకున్న‌ బీజేపీ..

BJP:  ‘‘ఉత్తరాదికి చెందిన భారతీయ జనతా పార్టీ బలం దక్షిణాదిన నామమాత్రమే… హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించే బీజేపీకి ఇక్కడ ఉనికే లేదు…’’ అంటూ ప్రతిపక్షాలు, మేధావులుగా చెప్పుకునే రాజకీయ విశ్లేషకులు నిత్యం చేసే ప్రకటనలు తప్పని 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ ఈ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండీ’ నేతలు మరింత రెచ్చిపోయి…

Read Full News

politics: హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు..!

Telugustatespolitics: తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వారి ఇల్లు ఎలా తగలబడిరదా అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని, పార్టీని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఓడిపోయింది అని బాధపడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి.. ఒకే…

Read Full News

Janasena: జనసేన పార్టీ నాయకుల్ని ఇబ్బందులుపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు: నాదెండ్ల మనోహర్

Janasena; ‘ ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉండాలన్న బలమైన ఆకాంక్షతో, అధినేత పవన్ కళ్యాణ్ మీద అచంచల నమ్మకంతో ప్రజలు ఓటు వేశారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతా ఆశ్చర్యపోయే రీతిలో తెనాలి రూపురేఖలు…

Read Full News

janasena: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశం; మంత్రి నాదెండ్ల మనోహర్.

Nadendlamanohar: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశమ‌న్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా స్వీకరించి కష్టకాలంలో వారికి అండగా నిలవాలన్న మనోహన్నత లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టార‌న్నారు. సభ్యత్వ నమోదు ద్వారా క‌ష్ట‌కాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తలో ధైర్యం, భరోసా నింపగలిగామ‌ని…

Read Full News

Bandisanjay: రుణ‌మాఫీ అమలుపై కాంగ్రెస్ మాట త‌ప్పింది: బండిసంజ‌య్‌..

Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్ర‌హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప…

Read Full News
Optimized by Optimole