ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది : పవన్ కళ్యాణ్
APpolitics:‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాంమన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయని తెలిపారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు…