తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!
ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్…