Telangana : కోదండరామ్‌ చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!

Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్‌ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్‌ గారు చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్‌ ముద్దసాని కోదండరామ్‌ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్‌ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో…

Read More

RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద ఈ స్థాయి విమర్శలెందుకు?

శేఖర్ కంభంపాటి (సీనియర్  జర్నలిస్ట్ ):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి  తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ  చర్చ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ ను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది భాష ముఖ్యం కాదని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు మాత్రం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక రాష్ట్ర…

Read More

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్..

TelanganaRtc:  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు  ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నాడు.ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల…

Read More

శాసనసభ మండలి సలహాదారుగా ప్రసన్న కుమార్..

Telangana: తెలంగాణ శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.ఇండియన్‌ గవర్నమెంట్‌లో విభిన్న హోదాల్లో 30 ఏళ్లపాటు ప్రసన్నకుమార్ తన సేవలందించారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలపై ఆయనకు అపార అనుభవం ఉంది.ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సలహాదారుగా సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు చేయగా.. ఆ ప్రతిపాద నలను శాసన సభ, మండలి సభాపతులు గడ్డం ప్రసాద్, గుత్తా సుఖేందర్‌ రెడ్డిలు ఆమోదించారు.  

Read More

మట్టి గాజులు ఆడవారికి అందమే కాదు ఆరోగ్యం..

Womenbangles:   తెలంగాణలో మట్టి గాజుల సంస్కృతి అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించ కూడదు. మారాజు యోగ్య తతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి. అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి….

Read More

మీకు మగబిడ్డ ఒక్కరా, ఇద్దరా? ఎక్కడ చూసినా గాజుల ముచ్చటే ..!

Women bangles sentiment: ఈసంగతి మీకు తెలుసా..! ఒక్క మగ బిడ్డ ఉన్న తల్లి..ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలట , ఇద్దరు బాబులు ఉన్న తల్లి.. ఐదుగురు బిడ్డల తల్లితో గాజులువేసుకోవాలట.. అది కూడా సంక్రాంతి ముందేనట..లేదంటే ఏదో జరిగిపోతుందంటా..ఇదే సెంటిమెంట్ ప్రచారం ఆ నోటా..ఈ నోటా ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. తెలంగాణలో ఎక్కడా చూసినా ఇదే చర్చ హాట్ టాపిక్‎గా మారింది. ఎక్కడ ఇద్దరు ఆడవాళ్లు కలుసుకున్నా..ఇదే ముచ్చట పెడుతున్నారట. మొత్తానికి…

Read More

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ ఓటు బీజేపీకే!

తెలంగాణలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశించిన కేసీఆర్‌ ఆశలను వమ్ముచేస్తూ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పుకు ఓటు వేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి రావడంతో బొటాబొటి ఆధిక్యతతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 2018తో పోలిస్తే 2023లో బీజేపీ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఆ పార్టీ  రాష్ట్రంలో క్రియాశీలకంగా మరబోతోందని చెప్పవచ్చు. వాస్తవానికి తెలంగాణలో మొదటి నుండి కేసీఆర్‌ ప్రభుత్వం…

Read More

విమర్శలు సరే! వాస్తవాలనూ విస్మరిస్తారా?

శేఖర్ కంభంపాటి ( సీనియర్  జర్నలిస్ట్ ): ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు  రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒంటికాలు మీద లేచేవి. స్వాతంత్ర్య భారతంలో అర్థ శతాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసిందనే విమర్శలు చేసేవి, ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి…

Read More

రామ దీక్ష చేపట్టనున్న బండి సంజయ్‌ కుమార్‌?

BJPTELANGANA: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ రామ దీక్ష చేపట్టనున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌, విశ్వహిందూ పరిషత్‌ హిందూధార్మిక సంఘాలు ఇచ్చిన సలహా మేరకు బండి సంజయ్‌ దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు కాషాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ ముఖ్య నేతలు కూడా బండి సంజయ్‌తోపాటు రామ దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన సన్నాహాలు సైతం…

Read More

“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!

BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను  సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..  మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో  ప్రజానాడి…

Read More
Optimized by Optimole