కరోనా కేసుల సంఖ్యలో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో అమెరికా పేరిట ఉన్న రికార్డును.. భారత్ గురువారం ఒక్కరోజే 3,14,835 కేసులతో నమోదవడంతో అధిగమించింది.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవడానికి గురువారం నమోదైన గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. అమెరికాలో లక్ష కేసులు నమోదవడానికి 33 రోజుల సమయం పడితే.. భారత్ పది రోజుల్లోనే అసంఖ్యను చేరుకుంది. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే కరోనా మరణాలు అమెరికా కంటే భారత్లో తక్కువగా ఉండటం. కరోనా మరణాల్లో అన్ని దేశాలతో పోలిస్తే బ్రెజిల్ ముందుంది. రోజుకూ మూడు వేల పైగా మరణాలతో బ్రెజిలో అగ్రస్థానంలో.. అమెరికా రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.
దేశంలో ‘ఎమెర్జెన్సీ’ పరిస్థితి..
దేశంలోని ప్రస్తుత పరిస్థితులును సుప్రీంకోర్టు ‘ఎమెర్జెన్సీ’ తో పోల్చింది. కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించడం కోసం జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీచేసింది. అంతేకాకుండా పరిస్థితులు దృష్ట్యా లాక్ డౌన్ విధింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.