×
In

అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్​న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం గ్రీన్​కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్​ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారతీయులకే అధిక ప్రయోజనం చేకూరనుంది. జో లోఫ్​గ్రెన్​, జాన్​ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్​ యాక్సెస్​ టు గ్రీన్​ కార్డ్స్ ఫర్​ లీగల్​ ఎంప్లాయిమెంట్​ (ఈఏజీఎల్​ఈ) చట్టం–2021’ను సభలో ప్రవేశట్టగా.. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది.. వ్యతిరేకంగా 65 మంది ఓటేశారు. ఇక సెనెట్​ ఆమోదం కూడా పొందితే ఈ ప్రతిపాదన చట్ట రూపం దాల్చనుంది.
ప్రస్తుత వలస విధానంలో భారత్​కు కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్​ 1బీ వర్కింగ్​ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు గ్రీన్​కార్డు పొందడంలో అడ్డంకిగా మారింది. అందువల్ల, తాజా బిల్లుకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం ఉన్న 7 శాతం ఉన్న కోటా 15 శాతానికి పెరగనుంది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ఇతర దేశాల కన్నా భారతీయులకే ఎక్కువ లబ్ధి చేకూరనుంది.
ఈ కోటాను 15 శాతానికి పెంచితే ఎక్కువ మందికి గ్రీన్​ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇమిగ్రేషన్​, సిటిజన్​ షిప్​పై.. కాంగ్రెస్​ చైర్మన్​ లోఫ్​గ్రెన్​ మాట్లాడుతూ.. ‘వలసదారులకు వీసాలను కేటాయించే ప్రాథమిక చట్టం 20 వ శతాబ్దం మధ్యకాలం నాటిది. ఈ చట్టంలో చివరిగా 1990లో మార్పులు చేశారు. ప్రస్తుతం గ్రీన్​కార్డుల జారీలో మార్పులు చేయాల్నిన అవసరం ఉంది. తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్​కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.
కాగా, ఈ బిల్లు గట్టెక్కితే హెచ్​1బి వీసాపై అమెరికాలో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరిగే అవకాశం ఉంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all
Optimized by Optimole