×

Nancharaiah merugumala senior journalist: 

ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్‌..కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!’

కాంగ్రెస్‌ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్‌ దళిత దిగ్గజం బాబూ జగ్జీవనరామ్‌ అంటే మా తరంలో చాలా మందికి ఇష్టముండేది కాదు. ఎందుకంటే, కాంగ్రెస్‌ పార్టీ బాబాసాహబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గారికి వ్యతిరేకంగా బాబూజీని వాడుకుందనీ, అనసూచిత కులాల ప్రజలను కాంగ్రెస్‌ లోనే ఉండేలా చేసిన సర్కారీ దళిత నేత జగ్జీవనుడని మాకు ‘మా పెద్దలు’ కొందరు చెప్పేవారు. కాంగ్రెస్‌ వ్యతిరేకతే ఐడెంటీగా మరిన మాకు ఈ మాటలు నచ్చేవి.  అయితే, నాటి ప్రధాని ఇందిరమ్మ లోక్‌ సభ ఎన్నికలు ప్రకటించగానే 1977 ఫిబ్రవరిలో జగ్జీవనరామ్‌ ‘కాంగ్రెస్‌ బందెలదొడ్డి’ నుంచి బయటపడ్డారు. అప్పుడాయన మా తరం యువకులకు దేవుడిలా కనిపించాడు. బాబూజీ దేశంలోని చర్మకార కులాలవారికి, చర్మకారేతర అనుసూచిత కులాలకు, ఆదివాసీలకు ఏం చేశారనే విషయం మాకు పెద్దగా పట్టలేదు. మాకు ఆయనలో నచ్చిందల్లా ప్రధానమంత్రి పదవిని అడ్డంపెట్టుకున్న ప్రజాస్వామ్య నియంత ఇందిరమ్మను ఎదిరించి కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చి ఆమెపై యుద్ధం ప్రకటించడమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే–జగ్జీవన్‌ రామ్‌ 1980ల ఆరంభంలో కాంగ్రెస్‌–జే అనే ఓ బుల్లి పార్టీ నడిపారు. 1983లో ఈ పార్టీ (కాంగ్రెస్‌–జే) తరఫున బద్వేలు నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికైన ఫ్యాక్షనిస్టు నేపథ్యం ఉన్న నాయకుడు బిజివేముల వీరారెడ్డి గారు 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ తరఫున నిలబడ్డారు. తర్వాత తెలుగుదేశంలో చేరారు. కాని, బాబూజీకి ఆయన ఏకైక కుమారుడు సురేష్‌ రామ్‌ వల్ల రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కూతురు మీరా కుమార్‌ తిరిగి కాంగ్రెస్‌ లో చేరి తండ్రి ‘పాపాన్ని’ ఏఐసీసీ ఆఫీసు వాకిట్లో కడిగేసుకున్నారు. అందుకే ఆమె లోక్‌ సభ స్పీకరయ్యారు. తండ్రి బాబూజీని అంబేడ్కర్‌ సాహబ్‌ పై ఆయుధంగా వాడుకున్న కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఐఎఫ్‌ ఎస్‌ అధికారిణి అయిన మీరా కుమార్‌ ను 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ దళిత అభ్యర్థి రామ్‌ నాథ్‌ కోవింద్‌ పై పోటీకి దింపింది. కోవింద్‌ కూడా చర్మకారేతర కోరీ అనే ఎస్సీ కులానికి చెందిన నేత.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole