‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. థియేటర్లలో మాస్ జాతర
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ వహించిన ఈ చిత్రానికి భారీ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో.. అటు చరణ్.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నెరవేరుస్తూ.. ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రేక్షుకులముందుకు వచ్చింది. రూ.500కోట్ల భారీ బడ్జెట్తో…
MLC2024: ఎమ్మెల్సీ టికెట్ దక్కేదెవరికి .?
MLCElections2024: ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్థులు..ఆశావహులు ప్రచారాన్ని మొదలెట్టారు. రోజువారీగా వివిధ కార్యక్రమాల పేరిట ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సమంగా సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచించడంలోనిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరునూరైనా సరే బలమైన అభ్యర్థిని రంగంలో నిలిపి గెలిచి తీరాలని దృడ నిశ్చయంతో కనిపిస్తోంది. టికెట్ కోసం మంత్రుల లాబీయింగ్.. కరీంనగర్,…
కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన.. ఆమహానీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా మౌనం వహించడం మేధావుల లక్షణం కాదని.. ధీరోదాత్తుల మారి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇక అహింస ద్వారా…
ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి :టీపీసీసీ రేవంత్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారాన్ని పదిలం చేసుకోవడానికి.. కేసిఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. 2014 నుంచి సిఎం కేసిఆర్ ఇదే తరహ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదని..రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగిస్తునే ఉన్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక…
J&Kpolls: గాయపడ్డ కశ్మీరీల తీర్పేంటి..??
Jammukashmir: భూతలస్వర్గం కశ్మీర్ గాయాలు మాన్పే ఎన్నికల చికిత్సకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది ‘…ఇవన్నీ కాదు, మాకు ఎన్నికైన ప్రభుత్వం కావాలి’ అంటున్న సగటు జమ్మూ -కశ్మీర్ ప్రజల ఆకాంక్ష తీర్చే ఎన్నికల ప్రక్రియ మొద లైంది! అధికరణం 370 ఎత్తివేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగలేదు. భారత ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్లో ఇటీవల రెండోసారి పర్యటించి, క్షేత్ర సమాచారం సేకరించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. భద్రతపై కేంద్రం ఇటీవలే…
ARTISTMOHAN:నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…!
Taadi Prakash: (సెప్టెంబర్ 21 మోహన్ ఏడవ వర్ధంతి) హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా ఈ చదువుకోవడమేమిటో అని విసుక్కున్నా చికాకు పడినా.. రచయితలు, ఆర్డిస్టులు, కవులు, జర్నలిస్టులూ ఎప్పుడూ చదువుతూ ఉండవల్సిందేనని పదేపదే చెబుతుంటాడు. మోహన్ అలాగే…
అన్ని ఫ్రీగా కావాలి… అతి చవగ్గా కావాలి..!!
చాడశాస్త్రి: హైదరాబాద్ నుండి వైజాగ్ కి వందే భారత్ ట్రైన్ పెట్టారో లేదో… టిక్కెట్ చార్జీలు మీద ఒకటే గొడవ. అన్ని ఫ్రీగా కావాలి… లేదా కనీసం అతి చవగ్గా కావాలి… పోనీ ఉన్న వాటితో సర్దుకుపోతామా అంటే విదేశాల ఫొటోలు పెడుతూ, వాటితో పోలుస్తూ అక్కడ సదుపాయాలు బ్రహ్మాండం, ఇక్కడ పరమ దరిద్రం అంటూ విమర్శలు. సరే! విమర్శించ వచ్చు. విమర్శలే రాజకీయ పాలకులను అదుపులో ఉంచుతాయి. కానీ ఏదీ విశ్లేషించకుండా అర్ధం పర్థం లేని…
దీదీకి ఓటమి భయం పట్టుకుంది : ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరగణాల జిల్లాలోని జోయా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీదీ ఓడిపోతానన్న భయంతో నందిగ్రామ్ లో తిష్ట వేశారని అన్నారు. ఓటమి తథ్యమని భావించిన మమతా మరో నియోజకవర్గంలో పోటీ చేసే విషయమే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని…