తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు..!

తెలంగాణలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. అటు పార్టీకి వీర విధేయులం అంటూ సీనియర్ నేతలు భేటీ అయితే? ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి పీసీసీ రేవంత్ కి సవాల్ విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు సీనియర్ నేతలు ఈ మీటింగ్తో హైకమాండ్ కి ఏం చెప్పదలచుకున్నారు? అసమ్మతి వాదులం కాదు.. మా తాపత్రయం అంతా…

Read More

‘దంగల్ ‘ రికార్డ్ బ్రేక్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ..

1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం ఎనిమిదవ రోజు(19.15కోట్లు).. అమిర్ ఖాన్ దంగల్(రూ.18.59 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి.. బాహుబలి_2 (19.75)చేరువలో ఉంది. టోటల్గా ఈ సినిమా ఇప్పటివరకూ రూ.116.45 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ సినిక్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్‌ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు…

Read More

శ్రీలంకపై రెండో టెస్టులో భారత్ ఘననిజయం..!

శ్రీలంక తో జరుగుతున్న పింక్‌ బాల్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీం ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులో దిముత్‌ కరుణరత్నె సెంచరీతో రాణించగా (107).. కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో (54) మెరిశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్‌ పటేల్‌.. రెండు…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More

బాలీవుడ్ స్టార్ హీరో మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్..?

టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన నటి రష్మిక మందన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘అర్జున్​రెడ్డి’ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక స్పెషల్​ సాంగ్ చేయనున్నట్లు బీటౌన్​ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనిల్​ కపూర్​, బాబీ డియోల్​, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రష్మిక.. అల్లు అర్జున్_ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. ఆ…

Read More

‘కపిల్ దేవ్’ రికార్డును బద్దలు కొట్టిన పంత్ ..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రేర్ ఫీట్ సాధించాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కపిల్ దేవ్ పేరిట ఉన్న 40 ఏళ్ల రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో…

Read More

వెస్టిండీస్ జట్టుపై భారత మహిళల జట్టు ఘన విజయం..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​లో భారత జట్టు అదరగొట్టింది. శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 318 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో స్నేహ్​ రానా 3, మేఘనా సింగ్​ 2, రాజేశ్వరి గైక్వాడ్​, పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో వికెట్​ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అంతకుముందు…

Read More

తొలిరోజు కలెక్షన్లతో దుమ్మురేపిన “రాధే శ్యామ్ “

ప్రభాస్‌ – పూజా హెగ్డే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి.. కలెక్షన్ల పరంగా తొలిరోజు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ములేపింది. దేశ వ్యాప్తంగా రూ.48 కోట్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ఓవర్సీస్…

Read More
Optimized by Optimole