డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ప్రజాప్రతినిధులు..

సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులతో పాటు కొందరు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన రతన్ రెడ్డి, కలహన్ రెడ్డి నోటీసులు అందజేసినట్లు, వారు త్వరలో విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. మిగత వారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసుల వెల్లడించారు. దీంతో వారెవరు అన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా మత్తు పదార్ధాలకు సంబంధించి…

Read More

Maharashtraelections: ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ‘మహా’ సంగ్రామం..!

Maharashtra elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ…

Read More

చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ

రాజకీయ పార్టీలు నిర్వహించే  ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ  వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని  ఆర్టికల్ 19(1) బి కి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. 1972లో ముంబై పోలీస్ కమిషనర్ ఇటువంటి జీవో జారీ చేయగా.. హిమ్మత్ లాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జీవోను కొట్టివేసిందని గుర్తు చేశారు. సాధారణంగా ఇటువంటి జీవోలు  పోలీసులు…

Read More

కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్‌ ఇంగ్లండ్‌ ప్రధానైతే..?

nancharaiah merugumala (సీనియర్ జర్నలిస్ట్) బ్రాహ్మణ స్త్రీ కూతురు కమల అమెరికా ఉపాధ్యక్షురాలైతేనే సంబరపడ్డాం! మరి కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్‌ ఇంగ్లండ్‌ ప్రధానైతే…. –––––––––––––––––––––––––––––––––––––––––––– తమిళ బ్రాహ్మణ డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ కూతురు కమలా హ్యారిస్‌ 2020 ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కొందరు భారతీయులు సంబరపడ్డారు. 2022 జులై మాసంలో ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (అదే ఇంగ్లండ్‌ అధికారిక నామం) ప్రధానమంత్రిగా కన్నడ బ్రాహ్మణ దంపతులు సుధ, నాగవార రామారావు (ఎన్‌…

Read More

jagityala: ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య..!

జగిత్యాల: స్నేహితుల తీరుతో మానసికంగా క్షోభకు గురైన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి (KPHB)లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడినదంటూ స్నేహితులు వైష్ణవి, సంజన ఆమెను అనుచితంగా అవమానించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 2న స్వగ్రామానికి వెళ్లి గడ్డి మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే…

Read More

Valentine’sday: భగ్న_ప్రేమికుల_దినోత్సవం…

విశీ: “పెళ్లయ్యాక నువ్వు చర్చిలో మా మతం పుచ్చుకుంటావా? లేక నేను గుడికొచ్చి మీ మతం తీసుకోవాలా” అని ముందే కూలంకషంగా చర్చించుకునే ప్రేయసీ ప్రేమికులకు.. “ఎంతైనా మీ కులం వాళ్లకు మా కులం వాళ్లంటే ఇష్టం. వెంట పడి మరీ మమ్మల్ని పడేస్తారు” అని సరదాగా సీరియస్ కామెంట్లు చేసే ప్రేమికురాళ్లకు.. “మా మతంలో ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. కాబట్టి నువ్వే మా మతంలోకి మారిపో” అని సింపుల్‌గా…

Read More

review: ఇంకిపోని సంభాషణలు..!

అనూష రెడ్డి(ఉస్మానియా యూనివర్సిటీ):  ఈ పుస్తకంలో కథలు చాలా బాగున్నాయి.  నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథలు “కారు చెప్పిన కథ “, “ఉర్సు”. కారు చెప్పిన కథ ఒక్క క్షణం నాకు కన్నీళ్లు పెట్టించింది…ఈ కథలో రచయిత చేపింది అక్షర సత్యం.. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ఆక్సిడెంట్ చాలు ఎన్నో జీవితాల్లో,ఆశలను , వల్ల ఆశయాలను, బంధాలను, భరోసా గా ఉన్న వాళ్లను దూరం చేసి కన్నీళ్లను మిగిలిస్తుంది. ఉర్సు కథ కూడా…

Read More
Optimized by Optimole