ఔరా! ఎంతటి మొనగాడవు..!!
– ఎట్లా అబ్బింది నీకింతటి నేర్పరితనం? – ఇన్నేసి యేళ్లు ఈ నైపుణ్యాన్ని కాపాడుతూ, ఎలా వన్నెపెట్టగలిగావు? ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనొల్డో ప్రస్తావన వస్తే చాలు, మన మెదళ్లలో ఇన్నేసి ప్రశ్నలు సహజం! ఒళ్లు గగుర్పాటుకు ఇది అదనం. ఎందుకంటే, అతగాడి రికార్డు అలాంటిది. వింటేనే విస్మయం కలిగించే రికార్డులు సరే, చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా… మైదానమంతా లాఘవంగా పరుగెత్తే వేగం, డేగలా ఎగిరే సత్తా, రబ్బరులా వంగే శరీర విన్యాసం, కదలికల…