శ్రీధరన్ గెలుపు కేరళ మార్పుకు నాంది : ప్రధాని మోదీ
కేరళలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ గెలుపు మార్పుకు నాంది అని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కేరళలోని పథనందిట్టా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ లతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపి పట్టంకడతారని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నొ సేవలందించిన శ్రీథరన్, ప్రజలకు సేవలందిచేందుకు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఎన్‌డీఎ ప్రభుత్వమని…